
లేడీ సూపర్ స్టార్ నయనతార దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఉన్న అందమైన మరియు ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయటంలో కూడా ఆమె ముందుటారు. నయనతార అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరని, ఆమెకు ఉన్న క్రేజ్, టాలెంట్ కారణంగా నిర్మాతలు ఆమె డిమాండ్లను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిందే. ప్రస్తుతం, లేడీ సూపర్ స్టార్, శివ దర్శకత్వం వహిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘అన్నాతే’ లో నటిస్తుంది. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, రెమ్యునరేషన్ తగ్గించకుండా సినిమాలు చేసే నయనతార ఈ చిత్రానికి మాత్రం తగ్గించిందని తెలుస్తోంది. నయనతార తన మునుపటి సినిమా ‘దర్బార్’ కోసం రూ. 5.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆమె రూ. 10.5 కోట్లు పొందబోతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ‘అన్నాతే’ నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ పుకారును ఖండించింది. నయనతార దర్బార్ కోసం తీసుకున్నదానికంటే 20% తక్కువ డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.