
బాలీవుడ్ హిట్ చిత్రం 'అంధాదున్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కొన్ని నెలల క్రితం పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు కూడా. మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ పాత్రలో నితిన్ కనిపించనుండగా, టబు పాత్రలో ఎవరు కనిపిస్తారనేదే ప్రశ్న. మళ్ళీ టబునే అడుగుదామనే ఆలోచన టీంకు వచ్చినప్పటికీ ఆమె అందుకు అంగీకరించందని లేదా భారీ మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుందని డ్రాప్ అయ్యారు. ఇక ఇప్పుడు నిర్మాత సుధాకర్ రెడ్డి లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ పాత్ర కోసం అడగగా....ఆమె పెద్దగా ఆసక్తి చూపించకపోవడమే కాగా ఖంగుతినే రేటు చెప్పింది. 9కోట్ల భారీ రెమ్యునరేషన్ ను ఆడిగిందట. దీంతో షాక్ అయిన యూనిట్ ఆమెతో ఇంకా బేరాలడుతున్నట్లు తెలుస్తోంది. మరి నయన్ కాస్తాయిన కిందకి దిగుతుందేమో చూడాలి.