
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 నేటితో ఆరు వారాలు పూర్తిచేసుకోబోతోంది. ఆరో వారం ఎలిమినేషన్ కోసం 9 మంది నామినేట్ కాగా.. లాస్య, నోయల్, హారిక సేఫ్ జోన్లోకి వెళ్లినట్టు శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ప్రకటించారు. నిన్నటి ఎపిసోడ్లో అభిజిత్, దివి, అరియానా, అఖిల్ ను సేవ్ చేసి మోనాల్, కుమార్ సాయి విషయంలో కొంచెం డ్రామా చేసి కుమార్ సాయిను ఎలిమినెట్ చేయటం జరిగింది. అయితే బిగ్ బాస్ లో ప్రతి వారం ఎలిమినేషన్ ఓటింగ్ రూపంలో జరుగుతుందా? ఓట్లు బట్టే సభ్యులు ఎలిమినెట్ అవుతున్నారా? అనే ప్రశ్నలకు నిన్నటి ఎపిసోడ్ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఆదివారం నాటి ఎపిసోడ్లో మోనాల్‌ని సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడంతో ఈ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ప్రకారం కాదు.. రేటింగ్ ప్రకారమే అని స్పష్టమైంది. దీంతో బిగ్ బాస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. నీకు నచ్చినట్లు ఎలిమినెట్ చేసేలా అయితే ఓట్లు ఎందుకు వెయ్యమంటున్నావ్ బిగ్ బాస్? అని సోషల్ మీడియా వేదికగా స్టార్ మా, హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత వ్యతిరేకత రావటం మొదటిసారి. మరి దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.