
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆగస్టులో కూల్చిన సంత్ రవిదాస్ గుడిని అదే స్థలంలో పునర్నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.సంత్ రవిదాస్ గుడిని కూల్చిన అనంతరం భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో శాంతి, సామరస్యాలను కొనసాగించేందుకు వీలుగా ఈ గుడిని అదే స్థలంలో పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు అటార్నీ జనరల్ కే కే వేణు గోపాల్ సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలిపారు.