
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీ బ్లాక్ బస్టర్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్' షూటింగ్ లో బిజీగ ఉన్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టనున్నారు. అయితే ఈలోగ ఈ సినిమాలో పవన్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్త అల...బయటకు వచ్చిందో లేదో అప్పుడే ఫ్యాన్స్, ప్రేక్షకుల దగ్గర నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే నిధి ఎందుకండీ? అంటూ యూనిట్ ను ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎక్స్పోజింగ్ అయితే బాగా చేస్తుంది కానీ యాక్ట్ చేయడం రాదూ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి క్రిష్ అండ్ కో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Tags: #Cinecolorz #Nidhi #pawankalyan #PSPK27