
మెగా కాంపౌండ్ లో ప్రస్తుతం హడావుడి నెలకున్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహ ముహూర్తం దగ్గరపడింది. పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ విలాస్ లో జరగనున్న విషయం తెలిసిందే. దీంతో నిన్న ఉదయం మెగా కుటుంబ సభ్యులందరు తమ తమ కుటుంబాలతో కలిసి స్పెషల్ చార్టెడ్ ప్లైట్ లో ఉదయ్ పూర్ కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ మినహా మిగితా అందరూ నిహారిక-చైతన్యల పెళ్లిలో సందడి చేయనున్నారు. ఇక నిన్న సాయంత్రం నిహారిక-చైతన్యల సంగీత్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో నాగబాబుతో సహా అందరూ చిందులు వేసి నిహారిక గురించి కొన్ని విషయాలు పంచుకొని భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. ఇకపోతే వయసులో ఉన్న కజిన్స్ అందరూ చిందులతో రచ్చ రచ్చ చేసినట్లుగా ఫోటోలు వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది.