
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంత చెలాకి అమ్మయో అందరికి తెలిసిందే. ఫ్యామిలీ మొదట్లో ఆమె వెండితెర ఎంట్రీను వద్దన్నప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా సినిమాల్లోకి వచ్చింది. ఒక మనసుతో తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన మెగా డాటర్ అక్కడికే పరిమతం అవ్వకుండా బుల్లితెరలోనూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా చైతన్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమించి పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. మెగా ఫ్యామిలీ సమక్షంలో నిహారిక చైతన్యల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. అయితే ఇప్పుడు సినీ సిర్కిల్స్ లో హాట్ టాపిక్ ఏంటంటే....నిహారిక నటించిన చివరి చిత్రం 'సూర్యకాంతం'. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఒక తమిళ్ సినిమాను ఓకే చేసింది. స్వాతిని అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు వహిస్తుండగా...అశోక్ సెల్వం హీరోగా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ స్వాతిని నిహారిక బదులుగా మెఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుందని నిహరికకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తూ అధికారిక ప్రకటన చేసింది. దీంతో నిహారిక పెళ్లి తర్వాత ఇక సినిమాలు చేయబోదని అందరూ ఫిక్స్ అయ్యారు.