
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదెల పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులందరు జాజరుకానున్నట్లు తెలుస్తుంది. పెళ్లి పనులను నిహారిక మరియు ఆమె అన్న హీరో వరుణ్ తేజ్ దగ్గరుండి పర్యవేక్షించడానికి నెల రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. అయితే ఇక వారం రోజుల్లో పెళ్లి జరగనున్నడటంతో నిహారిక వెడ్డింగ్ కార్డును మెగా కుటుంబం విడుదల చేసింది. ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇకపోతే డిసెంబర్ 11న హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో సన్నిహితులు, శ్రేయోభిలాషులు, టాలీవుడ్ ప్రముఖల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసారు.