
మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం చైతన్యకృష్ణ జొన్నలగడ్డతో ఆగస్టులో హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా మెగా కుటుంబ సభ్యుల నడుమ జరిగిన విషయం తెలిసిందే. మొదటి నుంచి డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని నాగబాబు చెప్తూనే ఉన్నారు. అన్నట్లుగానే డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని వరుడు తండ్రి గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు వెల్లడించారు. ప్రభాకర్ రావు దంపతులు మొదటి పెళ్లి పత్రికను శ్రీవారి ముందు ఉంచి ఆశీర్వచనం తీసుకునేందుకు తిరుమల వెళ్లారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ పెళ్లి డేట్ మరియు వేదికను వెల్లడించారు. పెళ్లి డిసెంబర్ 9న రాజేస్తాన్ లోని ఉదయ్ పూర్ లోని ఉదయ్ పాలెస్ లో జరగనున్నట్లు చెప్పారు. వేదిక చూస్తుంటే పెళ్లి ఘనంగా కేవలం సన్నిహిత బంధుమిత్రుల మధ్య జరగనున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే నిహారిక-చైతన్య జంట అడపాదడపా జిమ్ కు వెళ్తూ కామెరాల కంటపడుతున్నారు.