
మెగా కాంపౌండ్ నుంచి ఒక క్రికెట్ టీంకి సరిపడా హీరోలు వస్తే కేవలం సోలో హీరోయిన్ వచ్చింది. ఆమె మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక. ఒకవైపు సినిమాలు చేస్తూనే తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి డిజిటల్ దునియాలో సత్తా చాటుతుంది. అయితే ఎవరు ఊహించని విధంగా కరోనా లాక్ డౌన్ సమయంలో అందరికి తీపి కబురు చెప్పింది. తాను చైతన్య విజయ్ అనే అతన్ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వెల్లడించింది. నాన్న కూచి అయినా ఈ అమ్మడు తాజాగా ప్రియుడి పుట్టినరోజు సందర్బంగా రెండు ఫోటోలు పెట్టి 'నీ నవ్వు నా గదికే కాంతిని ఇస్తుంది. నీ కౌగిలి ఇంటి మరిపిస్తుంది. ఐ లవ్ యూ' అంటూ తన విషెస్ తెలియజేసింది. ఈ ఫొటోల్లో ఇద్దరు తెల్ల దుస్తులు ధరించగా చైతన్య కోర మీసాలతో కొంత రగుడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. నిహారిక పెట్టిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.