
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కొంతకాలంగా ప్రేమిస్తున్న డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం జరిగింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ జంట నిన్న అంటే, ఫిబ్రవరి 1న హైదరాబాద్లో నిశ్చితార్థం జరిగింది. అయితే నిఖిల్ సిద్ధార్థ్ మరియు పల్లవి వర్మల నిశ్చితార్థo పెద్ద హడావుడి లేకుండా కేవలం దంపతులు కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలిగా ఉన్న పల్లవి వర్మ భీమావరంకు చెందిన అమ్మాయి. తాజా ప్రకారం, నిఖిల్ సిద్ధార్థ్ డాక్టర్ పల్లవి వర్మను స్నేహితుల ద్వారా కలుసుకున్నాడు. ఆ తరువాత ప్రేమలో పడ్డాడు. ఇక ఆలస్యం చేయకుండా పల్లవిని గోవాకు తీసుకెళ్ళి ఆమెకు ప్రపోజ్ చేశాడు. పల్లవి యెస్ చెప్పడంతో నిఖిల్ ఆమె కుటుంబ సభ్యుల నుండి కూడా అంగీకారం పొందాడు. ఈ ఏడాది ఏప్రిల్ 16న ముడుముళ్లతో ఒకటవ్వనున్నారు. మొత్తానికి మోస్ట్ వాంటెడ్ బ్యాచలర్స్ లిస్ట్ నుండి నిఖిల్ తప్పుకున్నాడు.