
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ భీమావరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నాడని అందరికీ తెలిసిందే. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, రాబోయే ప్రాజెక్టుల షూటింగ్లో బిజీగా ఉన్ననని... ప్రస్తుతం వివాహ పనులు చూసుకునే సమయం లేదని నిఖిల్ తెలిపాడు. నిఖిల్ మాట్లాడుతూ.."నేను నా తదుపరి మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ 2 చిత్రం కోసం రెడీ అవుతున్నాను. నా పెళ్లి పనులు జోరుమీదున్నాయి. కానీ నా ఫోకస్ అంతా తదుపరి సినిమాలపై ఉంచానని, కార్తికేయ 2 సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని" తెలిపాడు. తన హనీమూన్ ప్లాన్ గురించి నిఖిల్ సిద్ధార్థ్ ను అడిగినప్పుడు, “సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు నా హనీమూన్ ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాను. మా హనీమూన్ నా చిత్రం షూట్ ముగించిన తర్వాతే జరుగుతుంది" అని సమాధానం ఇచ్చాడు. నిఖిల్, డాక్టర్ పల్లవిల పెళ్లి హైదరాబాద్ లో ఏప్రిల్ 16న జరగనుంది.