
మిస్టరీ థ్రిల్లర్‌గా 2014 సంవత్సరంలో విడుదలైన చందూ మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం అప్పుడు ఫ్లాప్‌లతో పోరాడుతున్న యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌ను కూడా మార్చేసింది. అందుకే కార్తీకేయ సీక్వెల్ తో మళ్ళీ టీం రాబోతోంది. అయితే సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, కార్తీకేయ 2 లో స్వాతి రెడ్డితో కలిసి పనిచేయడానికి నిఖిల్ సిద్ధార్థ్ ఇష్టపడట్లేదట. నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్తో లేదా నభా నటేష్‌తో కలిసి కార్తికేయ 2 కోసం జతకట్టే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. తద్వారా ఈ చిత్రం అద్భుతమైన వ్యాపారం పొందుతుందని నమ్మకంగా ఉన్నాడట. కార్తికేయ 2కి చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు. కార్తికేయ 2 చిత్రంలో స్వాతి రెడ్డి కనిపించనున్నట్లు గతంలో వార్తలు వచ్చినాఇప్పుడు ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇష్టపడలేదు.