
హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నిఖిల్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ నిఖిల్ కెరియర్ ఏమి అంత సాఫీగా సాగలేదు. ఎన్నో ప్లాప్స్ తర్వాత కథలను ఎలా ఎంచుకోవాలో తెలుసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా నటించిన 'అర్జున్ సురవరం' ఎన్నో కాంట్రవర్సీల నడుమ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఎట్టకేలకు నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ కు మరో హిట్ చిత్రాన్ని ఖాతాలో వేసింది. ఇప్పుడు ఈ యంగ్ హీరో మార్కెట్ బాగా పెరిగింది. అందుకే, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ నిఖిల్ హీరోగా... కుమారి 21ఎఫ్ చిత్ర డైరెక్టర్ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.