
అనుష్క శెట్టి, మాధవన్ ప్రధాన పాత్రల్లో కోనా వెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన 'నిశ్శబ్దం' ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందాని ఎదురుచూస్తుంటే, ఎట్టకేలకు ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న మన ముందుకొచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయిన నిమిషం నుంచి మిక్స్డ్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఈ రివ్యూస్ చూస్తుంటే 'నిశ్శబ్దం' మరో 1- నేనొక్కడినే లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కూడా అంతే కాస్త ఇంటలిజెంట్ గా ఉండేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. నిశ్శబ్దంకు కూడా అందుకే మిక్స్డ్ టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ నిజానికి ఇది ఇంటలిజెంట్ ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ప్రెడిక్టబుల్ స్టోరీ అని టాక్ వినిపిస్తుంది. నిజానికి కథ కొంచెం రొటీన్ అవొచ్చు కానీ దాన్ని డైరెక్టర్ హేమంత్ మధుకర్ మల్చిన విధానం చాలా బాగుంది. నిశ్శబ్దం చూస్తే డైరెక్టర్ హేమంత్ కు అవుట్ ఫుట్ ఎలా రావాలనే దానిపై ఎంత క్లారిటీ ఉందో అర్ధం అవుతుంది. హాలీవుడ్ లో అయినా ఇంటలిజెంట్ సినిమాలు చాలా వరకు స్లోగానే సాగుతాయి. అలాంటి సినిమాల్లో నిశ్శబ్దం ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు.
ట్విస్ట్‌లను ఒకొక్కటిగా రివీల్ చేసిన విధానానికి డైరెక్టర్ ని మెచ్చుకోవాల్సిందే. టాలీవుడ్ లో సినిమాలు చిత్రకరించే విధానం మారుతుంది, రొటీన్ కమర్షియల్ సినిమాలు తీసే రోజులు పోయాయి అని ఇలాంటి సినిమా చూస్తేనే అనిపిస్తుంది. ఇంత సీరియస్, ఆకట్టుకునే సస్పెన్స్ కథలో కూడా కుదిరినంత మేర కామెడీని జోడించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంత ఏమవుతుంది ఏమవుతుందని చూస్తే...ఫస్ట్ హాఫ్ లో ఉన్న ప్రశ్నలకు సెకండ్ హాఫ్ లో ఎంతో చక్కగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రక్రియలో ఒకటి రెండు చోట్ల ఇది అవసరం లేదేమోనని అనిపించినా అవి మిహాయించొచ్చు. కొన్ని సినిమాలు ఒకోసారి చూడగానే అందరికి నచ్చకపోవచ్చు, కొంతమందికి అర్ధంకాకపోవచ్చు లేదా తమ ఉహాగానాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. అది డైరెక్టర్ తప్పు కాదు కదా? సినిమాను ఎటువంటి ఉహాగానాలు, అంచనాలు లేకుండా చూస్తే నిశ్శబ్దం మరో యాంగిల్ అర్ధం అవుతుంది. అనుష్కను ఎన్నో రోజుల తర్వాత చూస్తున్న ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయని తెలిసిన డైరెక్టర్ ఇటువంటి కథలో ఆమెను చుపించారంటేనే అయన గట్స్ ను అభినందిచొచ్చు. క్వాలిటీలో, స్టార్ కాస్ట్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను డైరెక్ట్ చేయడంలో హేమంత్ మధుకర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.