
సినిమా థియేటర్ల విధి అనిశ్చితంగా ఉండటంతో అనుష్క శెట్టి, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'నిశ్శబ్దం' ఒటిటి మార్గం పట్టిన చిత్రాల జాబితాలో చేరింది. ఈ మూవీ మొదట్లో జనవరిలో విడుదల కానున్నట్లు ప్రచారం సాగింది. తరువాత, ఇది ఏప్రిల్కు వాయిదా పడింది. ఇక ఇప్పుడు మహమ్మారి వ్యాప్తి చెందడంతో థియేటర్ విడుదల అసాధ్యమని భావించి డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేస్తుంది చిత్ర బృందం. ఎప్పటి నుంచో ఓటిటిలో వస్తుందని ప్రచారం సాగుతున్నా డేట్ ఎప్పుడన్నది చెప్పకుండా జాప్యం చేసిన టీం ఇప్పుడు అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రవేశిస్తుందని ప్రకటించింది. ఇది తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. సో, భాగమతి సినిమా తర్వాత సుమారు రెండు సంవత్సరాల గ్యాప్ తో అనుష్క శెట్టి నిశ్శబ్దం వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.