
టాలీవుడ్ స్వీటీ అనుష్క, మాధవన్ నటించిన 'నిశ్శబ్దం' అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఇది తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే మంచి మిస్టరీలతో కూడిన కధగా కనిపిస్తుంది. ఈ చిత్రం నుండి ఏమి ఆశించాలో ట్రైలర్ లో స్పష్టంగా తెలుస్తుంది. ట్రైలర్ విషయానికి వస్తే, 'నిశ్శబ్దం' అనేది సాక్షి (అనుష్క శెట్టి) పెయింటర్ మరియు ఆమె ప్రియుడు ఆంథోనీ (మాధవన్) ఒక ప్రసిద్ధ సంగీతకారుడు, ఇద్దరు కలిసి ఒక పెయింటింగ్ తీసుకోవటానికి ఒక హాంటెడ్ ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఎలాంటి సంఘటనలు జరిగాయి అన్నదాంతో కథ ముందుకు సాగుతుంది. సాక్షికి దగ్గరగా ఉన్న 25 ఏళ్ల అమ్మాయి తప్పిపోయిన పాత్రలో శాలిని పాండే నటిస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేసే పోలీసులుగా అంజలి, మైఖేల్ మాడ్సెన్లు కనిపిస్తారు. అవసరల మరియు సుబ్బరాజ్ కూడా ట్రైలర్లో తమ ఉనికిని చాటుకుంటారు. మరి అంచనాలు పెంచిన ట్రైలర్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యాక హిట్ అవుతుందో లేదో చూడాలి.