
'భీష్మ' తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన నితిన్ ప్రస్తుతం 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్నాడు. ఇది వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. దీంతో పాటు నితిన్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో కూడా కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యెలేటి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే కొద్దీ సేపటి క్రితం నితిన్ - చంద్రశేఖర్ యెలేటి యొక్క ప్రాజెక్ట్ టైటిల్ ను ప్రి లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘చెక్’ అని టైటిల్ పెట్టగా..పోస్టర్ నితిన్ చేతికి సంకెళ్లు కనిపిస్తున్నాయి. ప్రి లుక్ పోస్టర్ చూస్తుంటే ఇది ఖైదీ ప్రయాణంపై సాగే సినిమాగా అనిపిస్తుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ నిర్మిస్తుండగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ మరియ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదే కాకుండా నితిన్ హిందీ సూపర్ హిట్ చిత్రం 'అందాదున్' తెలుగు రీమేక్ లో కూడా నటించనున్నాడు. మొత్తానికి నితిన్ మంచి లైన్ అప్ ను సెట్ చేసుకున్నాడు.