
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లో ఒకరైన నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని షాలిని అనే అమ్మయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. నిజానికి, ఈ పెళ్లి ఎప్పుడో జరగాల్సింది కానీ కరోనా వచ్చి వెనక్కి నెట్టింది. మొన్నీమధ్యే కరోనా ఇప్పట్లో ముగిసేది కాదని గ్రహించిన యాక్టర్ నిఖిల్ పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు నితిన్ కూడా అదే గ్రహించుకొని హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్ లో పెళ్లి చేసుకోనున్నాడు. అయితే ఈ పెళ్ళికి మన తెలంగాణ సీఎం కేసీఆర్ ను పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించాడు. దీనికి సంబంధించిన ఫోటోను నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. నితిన్- షాలినిల పెళ్లి జులై 26న రాత్రి 8 గంటల 36 నిమిషాలకు కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది.