
రష్మిక మందన్న ఇప్పుడు యువ నటుడు నితిన్‌తో 'భీష్మ' లో నటిస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదలైన భీష్మ పాటలు మరియు టీజర్ ఇప్పటికే సినీ ప్రేమికులలో, అభిమానుల్లో మంచి క్రేజ్ సృష్టించడం కాక అంచనాలను పెంచాయి. ప్రస్తుతం భీష్మ బృందం మొత్తం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇటీవల నితిన్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి, భీష్మ ముచ్చట్లు మరియు అతని హీరోయిన్ రష్మిక మందన్న గురించి ఆసక్తిర విషయాలు చెప్పారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆహారపు అలవాట్ల గురించి నితిన్ ఒక దర్టీ సీక్రెట్ వెల్లడించాడు. రష్మిక మందన్న గురించి ఏదైనా రహస్యం ఉంటే చెప్పండని అడిగినప్పుడు, ఆమె కుక్క బిస్కెట్లు తింటుందని నితిన్ వెల్లడించారు. "ఎవరికైనా ఆకలేస్తే స్నాక్స్ గా బ్రెడ్, దోసా లాంటివి తింటుంటారు. కానీ రష్మీక కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పారు. పెడిగ్రీ కంపెనీ రష్మీకను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవచ్చని" హాస్యాస్పదంగా అన్నారు.