
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎక్కడికక్కడ నిలిపేసింది. ఎవరి ఇళ్లలో వారు కొన్ని నెలల పాటు జీవనం సాగించారు. ఇక వాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అందుకనే జాగ్రత్తలు పాటిస్తూ జీవినం యధావిధిగా కొనసాగించడమే అప్షన్. అయితే కొంతవరకు నిబంధనలు ఎత్తివేశాక చాలా మంది సినీ తారలు వెకేషన్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబాలతో కలిసి పబ్లిక్ తక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ అతని కుటుంబంతో దుబాయి వెళ్లి రాగా మొన్నీమధ్య సమంత నాగచైతన్యతో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. ఇక ఇప్పుడు యాంగ్ హీరో నితిన్ కూడా అతని సతీమణితో దుబాయ్ కు వెకేషన్ కు వెళ్తూ ఎయిర్పోర్ట్ లో దర్శనం ఇచ్చాడు. మొత్తానికి ఒకరి తర్వాత ఒకరు వెకేషన్ కు వెళ్తూ జాగ్రత్తలు పాటిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Tags: #Cinecolorz #Nithin #Vacation