
థియేటర్‌కి, ఓటిటికి చాలా వ్యత్యాసమే ఉంది. దాని ద్వారా వచ్చే అనుభూతి వేరు, దీని ద్వారా వచ్చే అనుభూతి వేరు. అలానే, పెద్ద తెరపై ఉన్న ఆంక్షలు ఓటిటి లో ఉండవు. దర్శకులకు, నిర్మాతలకు ఓటిటి లో కొంత ఫ్రీడమ్ ఉంటుంది. బౌండరీలు దాటి దర్శకత్వం వహించచ్చు, యాక్టర్లు ఆంక్షలు లేకుండా నటించచ్చు. అందుకే ఓటిటి లో అడల్ట్ కంటెంట్, వయలెన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది. తాజాగా వెబ్ సిరీస్ రంగంలోకి 'బ్రీత్ 2' తో అడుగుపెట్టిన నిత్యామీనన్ క్యారెక్టర్ లో భాగంగా నటి శృతి బాప్నతో లిప్ లాక్ చేసే సన్నివేశం ఇప్పుడు హాట్ టాపిక్ జి మారింది. ఇప్పటివరకు డీసెంట్ రోల్స్ చేసిన నిత్యామీనన్ ఒక్కసారిగా బోల్ పాత్రలో కనిపించేసరికి నెటిజన్లు అవ్వాక్ అయ్యారు. మరి ఈ ఓటిటిలు ఇంకా ఎంతమంది నటులను బోల్డ్ పాత్రల్లో చూపిస్తుందో చూడాలి.