ప్రేమికుల రోజు పర్ఫెక్ట్ సాంగ్ తో వచ్చిన నితిన్: భీష్మ ‘సింగిల్స్ యాంతమ్’

వాలెంటైన్స్ డే సందర్భంగా, నితిన్- రష్మిక మందన్న జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'భీష్మ' రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన టీం, తాజాగా సినిమా నుండి 'సింగిల్స్ యాంతమ్' ను విడుదల చేశారు. ఈ పాట ప్రత్యేకమైన సెట్లు మరియు అదిరిపోయే కొరియోగ్రఫీతో , యూత్ ఫుల్ మరియు సరదాగా సాగుతుంది. ఈ పాటలో నితిన్ వివిధ అవతారాలలో దర్శనమిచ్చాడు. సింగిల్స్ యాంతమ్ అనేది ఒక యువకుడి గురించి, అతను సరైన అమ్మాయితో కలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. యంగ్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించాడు. శ్రీమణి లిరిక్స్ రాసిన ఈ పాటకు మహతి స్వరా సాగర్ మ్యూజిక్ ఇచ్చారు. భీష్మకు ‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఆ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే ఈ పాటను కంపోజ్ చేశారు. వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నాగ వంశీ ఎస్ నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.