
మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ లో నితిన్ ఒకడవ్వడంతో తన పెళ్లి వార్త కచ్చితంగా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్ లో నితిన్ పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒక తెలుగు అమ్మాయిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడని ఆమెను వచ్చే ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకోనున్నాడని జోరుగా వినిపిస్తుంది. అయితే నితిన్ ప్రేమిస్తున్న అమ్మాయి సినీ ఇండస్ట్రీకి చెందినామే కాదు. కొంతకాలంగా తెలుగు అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్ మొత్తానికి ఏప్రిల్ లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆ అమ్మాయి పేరు షాలిని అని సమాచారం. యూకేలో ఎంబీఏ పూర్తి చేసిన షాలినితో నితిన్ గత నాలుగు ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడని....ఏప్రిల్ లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మీక హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'భీష్మ' లో నటిస్తున్నాడు.