
మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ లో నితిన్ ఒకడవ్వడంతో తన పెళ్లి వార్త కచ్చితంగా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్ లో నితిన్ పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒక తెలుగు అమ్మాయిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడని ఆమెను ఏప్రిల్ లో పెళ్లి చేసుకోనున్నాడని జోరుగా వినిపిస్తుంది. యూకేలో ఎంబీఏ పూర్తి చేసిన షాలినితో నితిన్ గత నాలుగు ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడని....ఏప్రిల్ 15న దుబాయ్ లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు వార్తలొచ్చాయి. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నితిన్ వివాహం వాయిదా పడింది. వివాహ ఏర్పాట్లకు తక్కువ సమయం ఉందని అతని కుటుంబ సభ్యులు భావించడంతో నితిన్ వివాహం ఏప్రిల్‌కు బదులుగా మేకు వాయిదా వేశారు. నితిన్- షాలినిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఇప్పటికే నితిన్ కుటుంబం దుబాయ్‌లోని ప్రసిద్ధ పాలాజ్జో వెర్సాస్ హోటల్ లో పెళ్లి పనులను ప్రారంభినట్లు సమాచారం.