
ఏప్రిల్ 16న దుబాయ్‌లో యువ నటుడు నితిన్, షాలినికి ముడుముళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అందరికి తెలిసిందే. కాని ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సరికొత్త సమాచారం ప్రకారం, నితిన్ కుటుంబం దుబాయ్‌లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌ను రద్దు చేసి షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తోంది. కరోనా వైరస్ భయంతో హైదరాబాద్ కు హైదరాబాద్ లోనే పెళ్లి జరపాలని భావిస్తున్నారు. వివాహానికి ఒక నెల సమయం ఉన్నందున, వివాహ సన్నాహాలు జోరందుకున్నాయి మరియు ఈ జంట కుటుంబాలు చివరి నిమిషంలో సర్దుబాట్లు చేస్తున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, అనేక ప్రయాణ నిబంధనలు ప్రకటించడంతో, ఈ జంట కుటుంబాలు చివరి నిమిషంలో వెన్యూ మార్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి వివాహాన్ని హైదరాబాద్ కు మార్చాలని ఆలోచిస్తున్నారు. రిసెప్షన్ ఏప్రిల్ 21న జరుగుతుంది. లండన్ లో ఎంబీఏ చేసిన షాలినితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నితిన్, పెద్దల ఆమోదంతో ముడుముళ్లు వేయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు.