
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యాచిలర్స్ లో ఒకడైన హీరో నితిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్ని రోజులుగా సినీ సిర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం నగర్ తో సంబంధం లేని అమ్మయినే పెళ్లాడుతున్నట్లు తెలుస్తోంది. వధువు రెడ్డి కుటుంబానికి చెందిన డాక్టర్ గా సమాచారం. పెళ్లి అంగరంగ వైభవంగా దుబాయ్ లో చెయ్యడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి పెళ్లికి సంబంధించిన ఏ విషయం మీడియాకు తెలియడం ఇష్టం లేదని అందుకే వధువు వివరాలు కూడా బయటకు రానివట్లేదని తెలుస్తోంది. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ 15న దుబాయ్ లో పెళ్లి జరగబోతున్నట్లు సినీ సిర్కిల్స్ లో చర్చ సాగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే నితిన్ నుండి అధికార ప్రకటన రావాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం నితిన్ "భిష్మ" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తరువాత వెంకీ అట్లూరితో "రంగ్ దే" అనే సినిమాలో నటించనున్నాడు.