
చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అందరిని టివిలకు కట్టిపడేసే షో 'బిగ్ బాస్'. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లను సక్సెసఫుల్ గా కంప్లైట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగోవ సీజన్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతుంది. అయితే కరోనా విజృభిస్తున్న సమయంలో హౌస్ లో ఎవరికీ కరోనా వచ్చినా ఆగమాగం అయిపోతుంది. అందుకే యాజమాన్యం ముందుచూపుగా కంటెస్టెంట్లను క్వారంటైన్ లో ఉంచి ఎవరికైతే పాజిటివ్ రాదో వాళ్లనే ఇంటి లోపలికి పంపించనుంది. అయితే షోను మరింత రక్తికట్టించే వైల్డ్ కార్డు ఎంట్రీ ఈసారి కష్టమేనని తెలుస్తుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కరోనా సోకినా అల్లకల్లోలం అవుతుందని ఈసారికి వైల్డ్ కార్డు ఎంట్రీని తీసేసినట్లుగా సమాచారం.