
బిగ్ బాస్ సీజన్ 4 లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో సింగర్ నోయల్ ఆరోగ్యం మరింత క్షిణించడంతో డాక్టర్ సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఇంటి నుంచి బయటకు రావాలని సూచించడంతో నోయల్ హఠాత్తుగా ఇంటి నుంచి చికిత్స నిమిత్తం బయటకు వచ్చారు. అయితే నోయల్ కోలుకున్న మరుక్షణమే మళ్ళీ తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళ్తారని బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో చెప్పారు. ఇదిలా ఉండగా నోయల్ కీళ్ల నొప్పులు, భుజాలు కదిలించలేకపోవడం, బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారు. ఇంట్లోకి వచ్చిన కొన్ని వారాలకే అతని ఆరోగ్యం పాడైంది ఇక ఈ వారం బేబీ కేర్ టాస్క్ నుంచి మరింత క్షిణించింది దీంతో నిత్యం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న నోయల్ మెరుగైన చికిత్స కొరకు ఇంటి నుంచి బయటకు రాక తప్పలేదు.