
టాలీవుడ్లో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ స్వయంకృషితో పైకెదిగిన నటుడు జూ.ఎన్టీఆర్. కెరియర్ ప్రారంభంలోనే ఆది, సింహాద్రి, లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ ను అందుకొని సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వచ్చారు. సినిమా సినిమాకు కధలో,పాత్రలో వైవిధ్యం చూపిస్తూ నటుడిగా ఎన్టీఆర్ అంతకంతకూ ఎదుగుతున్నారు. ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళితో ఎన్టీఆర్ జాతకట్టాడు. 'ఆర్ఆర్ఆర్' తో కొమరం భీమ్ గా అతి త్వరలో మన ముందుకి రాబోతున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తయ్యుంటే 2021 జనవరి 8న విడుదల అయ్యుండేది. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. అయితే ఎన్టీఆర్ 'విశ్వామిత్ర మహర్షి', 'బాలరామయణం' సినిమాల్లో నటించి 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ ఒక సీరియల్ లో కూడా నటించడాని చాలా తక్కువమందికే తెలుసు. ఎన్టీఆర్ నటించిన ఆ సీరియల్ పేరు 'భక్త మార్ఖండేయ'. ఈటీవీలో ప్రాసరమైన ఈ సీరియల్ లో ఎన్టీఆర్ భక్త మార్కండేయ పాత్రలో కనిపించారు. ఈ పాత్రలో జూ.ఎన్టీఆర్ లుక్ అద్భుతంగా ఉంది. ఈ సీరియల్ తరువాతనే ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.