
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఎన్నో ఏళ్లుగా తెలుగు చలనచిత్రానికి హిట్ సినిమాలు ఇస్తూ హీరోల మార్కెట్ తో పాటు తన గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళ్తున్న నిర్మాత దిల్ రాజు. తాజాగా దిల్ రాజు 50వ పుట్టిరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పార్టీకి సుమారు టాలీవుడ్ అగ్ర హీరోలందరూ వచ్చారు. అందరిని ఒకే చోట చూసేందుకు రెండు కళ్ళు సరిపోలేదు. అయితే అందరూ హీరోలు ఉన్న ఫోటోలో లోటుంది. ఆ ఫ్రెమ్ లో ఇద్దరు బడా హీరోలు మిస్ అయ్యారు. వారే జూ.ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్. బాలకృష్ణను పిలవలేదన్న కారణంతో జూ.ఎన్టీఆర్ ఈ పార్టీకి రాలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా మిస్ కొట్టారని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు.