
మెగా కాంపౌండ్ నుంచి అనేక మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా 'ఉప్పెన' సినిమాతో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చిన ఆహ్వానించడానికి మెగా అభిమానులు ఉండనే ఉండినప్పిటికి సినిమా హిట్ అవ్వాలంటే మాత్రం అందరూ కలవాలి. అందుకే ఉప్పెన టీం చిత్ర ప్రై రిలీజ్ ఈవెంట్ కు నందమూరి వారసుడు ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ వస్తున్నాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వెనక్కి తగ్గి ఇప్పుడు ఫిబ్రవరి 12న వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
Tags: #Cinecolorz #Ntr #Tollywood #Uppena