
నందమూరి తారకరామారావు గారి మనవడిగా తెలుగు ఇండస్ట్రీలోకి చిన్న వయసులోనే అడుగు పెట్టి మొదటి సినిమాలోనే అబ్బురపరిచే నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ తాతకు తగ్గ మనవడిగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్నాడు జూ. ఎన్టీఆర్. అయితే ఇప్పుడు జూ ఎన్టీఆర్ డ్రైవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే....ఆ మధ్య ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. అలానే నాన్న హరికృష్ణ, పెద్దన్న జానకిరామ్ కార్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఎన్టీఆర్ డ్రైవర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాడట. అత్యవసరమైతే తప్ప తాను డ్రైవింగ్ చేయట్లేదట. ఈ మేరకు తన కోసం ప్రత్యేకంగా ఒక డ్రైవర్ను పెట్టుకున్నాడట. అతని డ్రైవింగ్ లో ఇప్పటి వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వకపోవడమే కాక అతనికి తాగే అలవాటు కూడా లేదట. దీంతో ఆ డ్రైవర్ కు నెలకు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎన్టీఆర్ జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది.