
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ గురించి రోజుకో వార్త వచ్చినా అది సంచలనమే. 2020లో వచ్చే సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కు ఉన్నంత క్రేజ్ మరే సినిమాకి లేదు. స్వాతంత్ర్య సమరయోధుల నేపధ్యంలో సాగే సినిమా ఇది. టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జంటగా అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కు జంటగా బ్రిటిష్ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒలివియా నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. యూనిట్ ఆమె పేరును అనౌన్స్ చేసిందో లేదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై అభిమానం చూపించడం మొదలు పెట్టారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ..."హ్యాపీ న్యూ ఇయర్. నేను 2020 కోసం చాలా ఎదురుచూస్తున్నాను #ఆర్ఆర్ఆర్" అని ట్వీట్ చేసింది. అంతే ఆమె చేసిన ట్వీట్ కు క్షణాల్లో పది వేల లైక్స్, రెండు వేల షేర్లు వచ్చాయి.