
2020లో రిలీజ్ అయ్యే సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందా అంటే అందరూ టక్కున చెప్పేది ఆర్ఆర్ఆర్ గురించే. బహుబలి లాంటి తెలుగు చలన చిత్ర చరిత్రను తిరగరాసిన సినిమాను తెరకెక్కించిన రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో సినిమా చేస్తున్నాడు అనగానే ఎక్కడా లేని హైప్ ఒక్కసారిగా వచ్చింది. ఇక ఇందులో ఎన్టీఆర్ కోమరం బీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు అనేసరికి అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ప్రకటించిన స్టార్ కాస్ట్ తో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ తన వద్దకు వచ్చిన దర్శకులకు ఒకే మాట చెప్పి పంపేస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయ్యేవరకు మరో కధ వినని తేల్చి చెప్పాడట. అనుకున్నట్లుగా వచ్చే ఏడాది జులై 31న సినిమా రిలీజ్ అయితే ఆ తర్వాతే ఎన్టీఆర్ కధలను విని ఓకే చేస్తాడనమాట.