
ప్రముఖ హీరోయిన్లు పూజ హెగ్డే, ఈషా రెబ్బా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 2018 చిత్రం 'అరవింద సమేతా' లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు, సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, యువ అందగత్తెలు పూజ హెగ్డే, ఈషా రెబ్బా మళ్ళీ స్క్రీన్ స్పెస్ ను పంచుకోనున్నారు. విషయం ఏమిటంటే,బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, తాత్కాలికంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అని పిలవబడుతున్న సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే కాగా... ఈషా రెబ్బాను ఒక ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేసుకోవాలని యూనిట్ బావిస్తుందట. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 12 నుండి జరగనుంది. మొత్తం షూట్ ఫిబ్రవరి ముగింపు లేదా మార్చి నాటికి ముగించి.. వేసవిలోరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.