
అల్లు అర్జున్ నాపేరు సూర్య నాఇల్లు ఇండియా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ ఇకపై ఆ పొరపాటు చేయకూడదని ఫిక్స్ అయ్యి మంచి లైన్ అప్ ను సిద్ధం చేసుకున్నాడు. ఈనేపథ్యంలో అతను తదుపరి సినిమా కోసం తన ఆర్య డైరెక్టర్ సుకుమార్ తో జతకట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు 'పుష్ప' అనే టైటిల్ ను పెట్టి ఫస్ట్ లుక్ ను సైతం రిలీజ్ చేసింది టీం. ఫస్ట్ లుక్ లో సూపర్ మాస్ అవతారంలో కనిపించాడు బన్నీ. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్- నందమూరి తారక రత్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే...పుష్ప నుండి తప్పుకున్న తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి పాత్రలో తారక రత్నను తీసుకున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి.