
అర్థం కాలేదా? సీనియర్ ఎన్టీఆర్-మహా నటి సావిత్రి తెరపై కనిపిస్తే బొమ్మ ఎలా ఉండేదో ఇప్పుడు ఈ జెనరేషన్ లో మరోసారి అదే కాంబోలో బొమ్మ దద్దరిల్లబోతుంది. అదే....తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న జూ.ఎన్టీఆర్, మహానటి ఎలా ఉంటుందో ఆ పాత్రలో జీవించి కళ్ళకు కట్టినట్లు చూపించిన కీర్తి సురేష్ త్రివిక్రమ్ సినిమాలో జతకట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభంకానుంది. అయితే ఈలోపు సినిమాకు కావాల్సిన తారాగణంను సెట్ చేసే పనిలో పడ్డాడు గురూజీ. ఈమేరకు హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపించాయి...పూజ హెగ్డే, జాన్వీ కపూర్ ఇలా కొంతమంది పేర్లు వినిపించగా ఇప్పుడు కీర్తి సురేష్ ను సంప్రదించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి కీర్తి ఒప్పుకుంటే ఈ కాంబో దద్దరిల్లడం ఖాయం.