
తెలుగు జాతి గర్వపడేలా బాహుబలి లాంటి చిత్రాన్ని తెరకెక్కించి రికార్డులు కొల్లగొట్టి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న రాజమౌళి అంటే దేశ వ్యాప్తంగానే కాకా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, క్రేజ్ వచ్చింది. అందుకనే రాజమౌళి సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఇక బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు బడా స్టార్లు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరక్కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కోమరం భీమ్ గా కనిపించనున్నారు. అయితే రాజమౌళి సినిమాలకు లీకుల బెడద తప్పేట్టు లేదు. బాహుబలి చిత్రంకు సంబంధించిన ఎన్ని లీక్ లు ఆ మధ్య యూనిట్ ను ఇబ్బంది పెట్టాయో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆర్ఆర్ఆర్ కు ఆ చిక్కొచ్చి పడింది. రామోజీ ఫిలింసిటీలో పోలీస్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలోని కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అందులో ఎన్టీఆర్ కోమరం భీమ్ గా అదిరిపోయాడు. లీక్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఫోటో వైరల్ అయ్యింది. ఈ సినిమాపై జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇప్పటికీ లీకులు కావడంతో టీంపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది.