
ఎన్టీఆర్ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నా....కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీను విడీ వైకాపాకు వచ్చి ఎంతో కాలం అయింది. కానీ ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అవకాశం దొరికనప్పుడల్లా ఏకిపారేస్తున్నారు. ఆ మధ్య తిరుమల వ్యవహారంలో "నీ అమ్మ మొగుడు...ఖార్జుర నాయుడు కట్టించాడా" అంటూ కటువైన పదాజాలంతో కొడాలి నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. తాను, వల్లభనేని వంశీ ఈరోజున రాజకీయాల్లో ఇలా ఉన్నామంటే దానికి కారణం జూ.ఎన్టీఆర్ అని చెప్పారు. జూ.ఎన్టీఆర్ కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఆ రోజు నేను అన్న మాటలు స్వామిని ఉదేశించి అన్నవి కాదు. తాను చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని తెలిపారు. జగన్ తిరుపతి వెళ్లడం ఇది మొదటిసారి కాదు. కానీ చంద్రబాబు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని కామెంట్ చేశారు.