
తమిళం స్టార్ డైరెక్టర్లలో ఎఆర్ మురుగదాస్ ఒకరు. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ గా ఎలా తెరకెక్కించాలో తెలిసిన దర్శకుడు. ప్రస్తుతం ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, నయనతార హీరోయిన్ గా "దర్బార్" సినిమా తెరకెక్కుతుంది. ఈ ఇద్దరి కలయికలో సినిమా అనేసరికిx అంచనాలు భారీగా నెలకున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయినటీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇదిలావుండగా ఎఆర్ మురుగదాస్ త్వరలో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు "నా నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో అన్నదాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఒకసారి ఎన్టీఆర్ కు కధ వినిపించడం జరిగింది. కానీ అదీలోనే ఆగిపోయింది. ఈమధ్యకాలంలో నేను ఎన్టీఆర్ ను కలిసింది కూడా లేదు. నా నెక్స్ట్ సినిమా గురించి నేను ఇంకా ఆలోచించలేదని" తెలిపారు.