
బాహుబలి లాంటి తెలుగు బిగ్గెస్ట్ హిట్ చిత్రాన్ని అందించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వపడేలా చేసిన దర్శకుడు రాజమౌళి నుండి వస్తున్న తదుపరి చిత్రమ్ పైనే ఇప్పుడు అందరి ఫోకస్. టాలీవుడ్లో ఇద్దరు బడా స్టార్లు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకోగా...వచ్చే ఏడాది జులైకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ పక్కన జోడిగా చేస్తుంది ఎవరో అనే ఆసక్తి అందరిలో నెలకుంది. దీంతో నేడు ఎన్టీఆర్ సరసన నటించే ముద్దుగుమ్మ ఎవరూ అనేది ప్రకటిస్తామని నిన్న చిత్ర యూనిట్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకుRRR సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్‌ను జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఆమె పేరును ట్విట్టర్లో ప్రకటించింది. కుందనపు బొమ్మ లాగా ఉన్న ఇమే తాజాగా ఆమె చదువులు పూర్తి చేసుకుంది. మొత్తానికి ఈమెను చూసి అభిమానులు చిందులేస్తున్నారు.