
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న సినిమా 'అల..వైకుంఠపురంలో'. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కనుంది. అల్లు అర్జున్ చాలా గ్యాప్ తర్వాత తెరపై కనిపించడం,బన్నీ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం అవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ సినిమాకు ఈసారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అందుకే గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తుంది చిత్ర యూనిట్. అయితే నేడు హైదరాబాద్ లో స్పెషల్ స్క్రీనింగ్ వెయ్యనుంది చిత్ర బృందం. అందుతున్న సమాచారం మేరకు జరగబోయే స్పెషల్ స్క్రీనింగ్ కు ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ రానున్నారట. మరి ఈ ఇద్దరు స్క్రీనింగ్ కి వస్తే సినిమాను పరోక్షంగా ప్రమోట్ చేసినట్లే.