
బాహుబలితో తెలుగు సినిమాను ఇంటెర్నేష్నల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం రాజమౌళి టాలీవుడ్ లోని ఇద్దరు బడా స్టార్లతో కలిసి 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో అలరించనున్న సంగతి విదితమే. అయితే ఇది చరిత్ర ఆధారంగా తీస్తున్నది కాదని కల్పిత కథ అని రాజమౌళి ముందే క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన కొమరం భీం టీజర్ లో ఎన్టీఆర్ రెండు భిన్నమైన గెటప్స్ కనిపించరు. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఇంకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నవాబులు బురిడీ కొట్టే తరుణంలో ఎన్టీఆర్ ముసలి గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఎన్నడూ ఉహించుకోలేని పాత్రలో చూసినట్లు అవుతుంది.
Tags: #Cinecolorz #KomaramBheem #Ntr #RRR