
నందమూరి సిసలైన వారసుడు జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' లో కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా కోసం కోట్ల కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ రెండు రోజుల క్రితం తిరిగి ప్రారంభమైంది. అభిమానుల ఎదురుచూస్తున్న కొమరం భీం టీజర్ కూడా అక్టోబర్ 22న విడుదల కానున్నట్లు ప్రకటించింది టీం. అయితే ఇది ఇలా ఉంటే జక్కన్న సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఓకే చేశాడు. దీని తర్వాత కేజీఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ లో ఓ మాఫియా బ్యాక్ గ్రౌండ్ సినిమాను ఎన్టీఆర్ ఓకే చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇది కాకుండా ఘాజీ సినిమాతో తెలుగు సినిమాల్లో ఇలాంటి సినిమాలు కూడా ఉన్నాయని నిరూపించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఎన్టీఆర్ సినిమా ఒకే అయినట్లు ప్రచారం సాగుతోంది. ఫిక్షన్ ఎలిమెంట్స్ తో రియల్స్టిక్ గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.