
బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ట్ గా అక్కినేని నాగార్జున ఒడిగిపోయారు. వీకెండ్ వస్తే చాలు ఫుల్ మస్తీ, నలు చివాట్లు, కొత్త కొత్త చాలెంజులతో అలరిస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో నాగ్ బిగ్ బాస్ నుంచి వెళ్తున్నారనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. అయితే కంగారు పాడాల్సింది ఏమి లేదు, నాగ్ కేవలం రెండు వారాలు మాత్రమే కనిపించరని తెలుస్తోంది. షూటింగ్ నిమ్మితం థాయ్ ల్యాండ్ వెళ్లి 10రోజులు షూటింగ్ లో పాల్గొని వస్తారని సమాచారం. ఇదేమి నాగ్ కి కొత్త కూడా కాదు, గత సీజన్ లో కూడా 60వ పుట్టినరోజు జరుపుకునేందుకు స్పెయిన్ వెళ్లిన నాగ్ రెండు వారాలు బిగ్ బాస్ లో కనిపించలేదు. అప్పుడు నాగ్ స్థానంలో రమ్యకృష్ణ అలరించింది. మరి ఈసారి కూడా శివగామి రమ్యకృష్ణ వస్తారా లేదా బిగ్ బాస్ సీజన్ 1 ను హోస్ట్ చేసి స్టేజ్ ను షేక్ చేసిన జూ.ఎన్టీఆర్ గెస్ట్ హోస్ట్ గా వస్తారా అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న చర్చ. ఆర్ఆర్ఆర్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండటంతో ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇది బిగ్ బాస్ ఏమైనా జరగొచ్చు.