
ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ "అల.. వైకుంఠపురములో విజయవంతంతో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమా ఎన్టిఆర్ తో చేయనున్న విషయం తెలిసిందే. అన్నట్లుగానే నేడు ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ రామ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జానకిరామ్ పుట్టినరోజు సందర్భంగా యూనిట్ ఈ ప్రకటన చేసింది. ఈ చిత్ర ఈ ఏడాది మే మొదట్లో షూట్ ప్రారంభం కానుంది. 2021 ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. రామ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ జనవరి 8, 2021న విడుదల కానుండగా, చిరంజీవి మరియు కొరటాల శివ యొక్క ఆచార్య మార్చి 2021 లో విడుదల కానుంది. అందుకే 3 నుండి 4 వారాల విరామం తరువాత, ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్-హారికా చిత్రం 2021 ఏప్రిల్ రెండవ భాగంలో విడుదల అవుతుంది.