
మొదటి సినిమా "అరవింద సమేత"తో మంచి సక్సెస్ ను చూసిన తరువాత, ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ రెండవ సారి సినిమాచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేసవి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇంతలో, మేకర్స్ ఈ ప్రాజెక్ట్ గురించి ఏది చెప్పకముందే, ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటికే ఉహాగానాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సీజన్లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం తెరపైకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ దర్సకత్వంలో వచ్చిన చిత్రం 'అల..వైకుంఠపురములో' ఈ సంక్రాంతికి విడుదలై భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో అతని తదుపరి ప్రాజెక్ట్ కూడా సంక్రాంతికు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే అభిమానులు వచ్చే జనవరి కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తారు. ఏదేమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏది నమ్మడానికి లేదు.