
గోవా బ్యూటీ ఇలియానా నడుము అందాలతో ఒకప్పుడు కుర్రకారు మతిపోగొట్టేసింది. ఆమె అందాలను చూస్తూ ఉండిపోయేవాళ్లంటే అతిశయోక్తి కాదు. దేవదాస్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత మహేష్ తో నటించిన పోకిరితో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరియర్ బాగుంది. దక్షిణాదిలో ఇక ఇలియానాకు తిరుగు లేదని అంతా భావించిన సమయంలో ఆమె బాలీవుడ్ కు జంప్ అయ్యి అక్కడ సినిమాలు చేయటం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఇలియానాకు కాలం కలిసి రాలేదు. చెప్పుకోదగ్గ హిట్లు లేకపోవడంతో డీలా పడింది. ఏదో అడపాదడపా పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు వచ్చినా నో అనకుండా చేస్తుంది. ఇక ఇప్పుడు మళ్లీ దక్షిణాదిలో సినిమాలు చేయాలని డిసైడ్ అయిన ఇలియానా మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. అయితే తమిళంలో ఖాకి ఫెమ్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా ఇలియానాను ఎంపిక చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.