
యువ నటుడు శర్వానంద్ తన అభిమానుల కోసం సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడు. శర్వా తదుపరి చిత్రం కోసం దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, మరోసారి శర్వానంద్ తన తదుపరి చిత్రంలో ఫిదా ఫేమ్ సాయి పల్లవితో స్క్రీన్ స్పెస్ ను పంచుకోబోతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ 'పడి పడి లేచే మనసు' సినిమాలో సాయి పల్లవి, శర్వానంద్ జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. కానీ ప్రధాన నటులకు వారి నటన పరంగా చాలా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు శర్వానంద్ కిషోర్ తిరుమలతో కలిసి కామిక్ ఎంటర్టైనర్ లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సినిమా మేకర్స్, కథానాయికగా సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారు. శర్వా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా మొదలు కానుంది. సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లవ్ స్టొరీ' సినిమాతో బిజీగా ఉంది.